పలు సంస్థలకు గవర్నర్ 38 లక్షల ఆర్థికసాయం

పలు సంస్థలకు గవర్నర్ 38 లక్షల ఆర్థికసాయం

హైదరాబాద్, వెలుగు:  మానవ అక్రమ రవాణాను నివారించడానికి కృషి చేస్తున్న ప్రజ్వలా ఎన్జీవోతో పాటు పలు సంస్థలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్థిక సహాయం చేశారు. అక్రమ రవాణా బాధిత మహిళలు, పిల్లల విద్య తదితర అవసరాల కోసం 4 సంస్థలకు రూ.38.59 లక్షలను అందజేశారు. ప్రజ్వలా ఎన్జీవో నిర్వాహకురాలు సునీత కృష్ణన్ కు రూ. 20 లక్షలు, బాసర ఆర్జేకేయూటీ వర్సిటీలో పలు ఇన్నోవేషన్లు, ఇంక్యుబేషన్ ఎంట్రపెన్యూవర్ షిప్ డెవలప్ మెంట్ (ఐఐఈడీ) అభివృద్ధికి రూ. 15లక్షల చెక్కును గవర్నర్ బుధవారం రాజ్ భవన్ లో అందజేశారు. 

అలాగే.. సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విద్యార్థులలో సమాజ సేవ నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి,  “తెలంగాణ రోలింగ్ ట్రోఫీ గవర్నర్” కోసం రూ .2.24 లక్షల చెక్కును అందజేశారు.  బేగంపేట మయూర్ మార్గ్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్  సీనియర్ సిటిజన్ల కోసం టీవీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కొనుగోలుకు రూ. 1. 35 లక్షల చెక్కును గవర్నర్ ఇచ్చారు.