విద్యా శాఖపై గవర్నర్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు : విద్యా శాఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శనివారం రివ్యూ చేపట్టారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, విద్యాశాఖ పై గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహరెడ్డి, ఇంటర్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన పాల్గొన్నారు.  విద్యా శాఖకు కేంద్రం నుంచి వివిధ స్కీమ్ లలో వస్తున్న నిధుల వివరాలను గవర్నర్ కు వివరించారు.

మా జిల్లాకు రండి..గవర్నర్​కు ఖమ్మం ఎంపీ రఘరామ్ రెడ్డి రిక్వెస్ట్

ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ఖమ్మం జిల్లాలో పర్యటించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి కోరారు. శనివారం ఆయన తన తండ్రి, మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డితో కలిసి రాజ్ భవన్ లో  గవర్నర్ ను కలిశారు. ఖమ్మం ఖిల్లాను, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్తూపాన్ని, కూసుమంచిలో కాకతీయులు నిర్మించిన శైవాలయాన్ని చూడాలని గవర్నర్ ను రఘురామ్ రెడ్డి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానంతో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సింగరేణి

పలు కేంద్రీయ పరిశ్రమలు, ప్రాజెక్టులు, అటవీ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని ఎంపీ వివరించారు. రాష్ట్ర గవర్నర్ గా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే మరింత ప్రాచుర్యం లభిస్తుందని, వీలైనంత త్వరగా రావాలని రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పందిస్తూ.. వీలైనంత త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తానని ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డికి మాటిచ్చారు. గవర్నర్ కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.