
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గురువారం 84వ ఆల్ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. 84 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ తరహా కార్యక్రమాలు భవిషత్తరాలకి ఆదర్శమన్నారు.
పెయింటింగ్స్ ఎన్నో హృదయాలను కదిలిస్తాయన్నారు. చిత్రకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కళా ప్రదర్శనలు దోహదం చేస్తున్నాయన్నారు. ఆర్ట్సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, ఉత్సవాల కన్వీనర్ సామల వేణు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.