వరంగల్ జిల్లాలో గవర్నర్ టూర్ సక్సెస్​

వరంగల్ జిల్లాలో గవర్నర్ టూర్ సక్సెస్​
  • ముగిసిన ఉమ్మడి జిల్లా పర్యటన    
  • జనగామ కలెక్టరేట్​లో అధికారుల ఘన స్వాగతం

జనగామ, వెలుగు: మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ టూర్ సక్సెస్ అయింది. గురువారం ఉదయం 10 గంటలకు జనగామ కలెక్టరేట్ కు వచ్చిన ఆయనకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, అడిషనల్ కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేశ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవందనం స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. 

కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా విశిష్టత, అభివృద్ధిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తదుపరి గవర్నర్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో, కవులు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన కళాకారుల పేరణి నృత్యం అలరించింది.