యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశం

నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో ఈరోజు(జూన్ 26) గవర్నర్ తమిళి సై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా బర్తరఫ్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీసీని బర్తరఫ్ చేయాలని ప్రభుత్వానికి పాలక మండలి సిఫార్సు చేసింది.

ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డారు. కాలేజీకి పరీక్షా కేంద్రాన్ని కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలపై వైస్ ఛాన్సలర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలో దాడులు చేసి కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.