ఏ సమస్య ఉన్నా సీఎంతో చర్చించడానికి సిద్ధమన్నారు గవర్నర్ తమిళి సై. ప్రధాని మోడీతో భేటీ అనంతరం మాట్లాడిన ఆమె..తనతో భేటీ కోసం సీఎం ఎప్పుడైనా తన ఆఫీస్ కు రావొచ్చన్నారు. తాజా పరిణామాలు ప్రధాని మోడీతో సహా అందరికీ తెలుసన్నారు. తాను చట్టం, వ్యవస్థ ప్రకారమే నడుచుకుంటానన్నారు. తనకు ఎలాంటి ఇగో లేదని.. అందరితో ఫ్రెండ్లీగా ఉంటానన్నారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదన్నారు. గవర్నర్ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలన్నారు. ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించారు. గవర్నర్ ఆఫీస్ నుంచి ఇలాంటివి రిపీట్ కావొద్దన్నారు. మొదటి నుంచి వైద్యంపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నానన్నారు. రాష్ట్రప్రభుత్వం తనకు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వట్లేదన్నారు. అన్ని విషయాలు ప్రజలకే వదిలేసానన్నారు.
రాజ్ భవన్ ను ,గవర్నర్ ను అవమానించారని..అయినా తాను పట్టించుకోలేదన్నారు .తాను తెలంగాణలో అధికారం చెలాయించడం లేదన్నారు. ఏ చర్యలు తనను ఆపలేవన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించానన్నారు.గవర్నర్ ప్రోటోకాల్ గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియదా? అని ప్రశ్నించారు. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కానీ గవర్నర్ వ్యవస్థను అవమానించడం సరికాదన్నారు.
మరిన్ని వార్తల కోసం: