నిజామాబాద్ : చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం నివారణకు చిరుధాన్యాలను ఉపయోగించుకోవాని గవర్నర్ తమిళి సై పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకంటే భారత్ ఇవాళ అన్ని రంగాల్లోనూ ముందుందన్నారు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్ తో సాధ్యమైందని చెప్పారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్ గా జీ20 దేశాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యూనివర్సిటీలో ‘‘ఇండియాస్ జీ 20 ప్రెసిడెన్సీ ఛాలెంజ్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఇండియా యాజ్ ది గ్లోబల్ లీడర్'' అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.