తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించాలి : గవర్నర్

తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించాలి : గవర్నర్

హైదరాబాద్ లో ఛాన్సలర్ కనెక్ట్స్ అలుమ్ని అనే కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. 14 యూనివర్సిటీల వీసీలకు సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడారు. పూర్వ విద్యార్థుల సహకారంతో అలుమ్ని చేయడానికి ఎంతో సహకారం అందడం గొప్ప విషయం అని చెప్పారు. అన్ని కాలేజీ యూనివర్సిటీల్లో ఇదే స్ఫూర్తితో పనిచేసి అభివృద్ధి దిశగా యూనివర్సిటీలను ముందుకు తీసుకొని వెళ్లాలని సూచించారు. తాను గవర్నర్ గా ఛార్జ్ తీసుకున్న తరువాత ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రూ.3.5కోట్లు తీసుకొని రావడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. కుటుంబంలో ఎదురైన చాలెంజ్ లను ఎదుర్కొంటే.. ఎలాంటి పరిస్థితులను అయినా సొసైటీలోనూ పరిష్కరించుకోవచ్చన్నారు.

తెలంగాణకు తాను గవర్నర్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు తమిళిసై. తెలంగాణ ప్రజలు తనతో మమేకమై ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తంజావూరులో తనకు ఎదురైన ఒడిదుడుకులను ఎక్కడా చూడలేదన్నారు. తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించాలన్నదే తన ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ప్రజలకు తన వంతు సహాయం ఏదైనా చేయాలనే సంక్పలం ఉందన్నారు. విద్య ద్వారా యువతకు ఎంతో సహాయం చేయవచ్చని అన్నారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన డబ్బులు పేద విద్యార్థులకు ఉపయోగిస్తామని, ఒక్క రూపాయి కూడా వృథా కాదని స్పష్టం చేశారు.