తాను తమిళనాడు ఆడబిడ్డనైనా తెలంగాణ ప్రజలకు సోదరినని గవర్నర్ తమిళి సై అన్నారు. భద్రాచలం ఆదివాసీలతో గవర్నర్ తమిళి సై ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తో ఆదివాసీ ప్రజలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యల గురించి విన్నవించారు. ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని గవర్నర్ ను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ ఇక్కడి సమస్యలను తాను అర్థం చేసుకున్నానని.. గిరిజన సమస్యలను వీలైనంత త్వరగా తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆదివాసీలు సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారని తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవాళ ఉదయం సికింద్రాబాద్ నుండి రైలు మార్గాన కొత్తగూడెం చేరుకున్న గవర్నర్ తమిళి సై. బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.