హనుమాన్ టెంపుల్​ను క్లీన్ చేసిన గవర్నర్

హనుమాన్ టెంపుల్​ను క్లీన్ చేసిన గవర్నర్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్ లోని హనుమాన్ టెంపుల్​ను గవర్నర్ తమిళిసై క్లీన్ చేశారు. అయోధ్యలో ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుండటంతో దేశ వ్యాప్తంగా దేవాలయాలను క్లీన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 

అందులో భాగంగానే గవర్నర్ తమిళిసై టెంపుల్​ను క్లీన్ చేశారని రాజ్ భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం టెంపుల్​లో నిర్వహించిన  ప్రత్యేక పూజల్లో గవర్నర్ పాల్గొన్నారు.