ప్రేమోన్మాది దాడి ఘటనపై స్పందించిన గవర్నర్

  • ప్రేమోన్మాది దాడి ఘటన తీవ్ర విచారకరం

హైదరాబాద్: వరంగల్ లోని నర్సంపేట మండలానికి చెందిన విద్యార్థినిపై ప్రేమోన్మాది జరిపిన దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఘటన పట్ల గవర్నర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి వరంగల్ యం.జి.యం. హాస్పిటల్ లో వైద్యం అందుకుంటున్న యువతి ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్ సూపరిటెండెంట్ తో గవర్నర్ ఫోన్ లో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.  మెరుగైన వైద్యం అందిచాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

 

ఇవి కూడా చదవండి

మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

ఒక్క నిమిషం లేటైతే అనుమతించరు.. మరీ మీరు కావొచ్చా..?

నిజామాబాద్లో రైస్ మిల్లర్ల మాయాజాలం

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు