బాలిక ఘటనపై గవర్నర్ సీరియస్

బాలిక ఘటనపై గవర్నర్ సీరియస్

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. మీడియాల్లో వచ్చిన వీడియోలు, ఫోటోలు, కథనాలు ఆధారంగా గవర్నర్ స్పందించారు. ఈ హేయమైన సంఘటనపై ఆమె తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

జూబ్లీహిల్స్‌లో అమ్నీషియా పబ్ నుంచి బాలికను ఐదుగురు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు పోలీసుల తీరుపై మండిపడ్డాయి. మొదట్లో హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడని ఆరోపణలు వచ్చినా.. వాటిని పోలీసులు ఖండించారు. ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. శనివారం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చూపిన విషయం తెలిసిందే. ఈరోజు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తల కోసం...

పిలిచి ముఖం చాటేసిన మంత్రిపై సర్పంచ్‌‌ల ఆగ్రహం

మొట్టమొదటి సారిగా మహిళల కోసమే..