దేవాలయాలను సందర్శించిన గవర్నర్

యాదాద్రి, వెలుగు: ఆలేరు మండలం కొలనుపాకలోని జైన్​ మందిర్​, శ్రీ సోమేశ్వరాలయం, భువనగిరిలోని స్వర్ణగిరిని -గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ   గురువారం జిల్లా పర్యటనలో భాగంగా సందర్శించారు.భక్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అంతకు ముందు కలెక్టరేట్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్​ సెక్రెటరీ బీ వెంకటేశం, జాయింట్​ సెక్రెటరీ జే భవాని శంకర్​, మున్సిపల్​  చైర్మన్​ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, డీసీపీ రాజేష్ చంద్ర, అడిషనల్​ కలెక్టర్లు పీ బెన్​ షాలోమ్​, కే గంగాధర్​ ఉన్నారు.