గవర్నర్ అవార్డులకు అప్లికేషన్ గడువు పెంపు

  • జనవరి 26న పురస్కారాల ప్రదానం 

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ ప్రతిభా అవార్డ్స్ 2024 కి అప్లై చేసుకునేందుకు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు రాజ్ భవన్ ప్రకటించింది. గత షెడ్యూల్ ప్రకారం.. శనివారమే అప్లికేషన్ గడువు ముగియాల్సి ఉండగా..పలు కారణాలతో పొడిగిస్తున్నట్లు చెప్పింది.   వచ్చే ఏడాది జనవరి 26న జరిగే..గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అవార్డులు అందచేస్తారని పేర్కొంది.

  ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లో రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భవన్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ https://governor.telangana.gov.inలో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ను   డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకుని నామినేషన్ ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పూరించి.. “ ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నర్ ,  రాజ్ భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500041” కు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సమర్పించాలని, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సమర్పణల కోసం దరఖాస్తుదారులు తెలంగాణ రాజ్ భవన్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ https://governor.telangana.gov.inని సందర్శించడం ద్వారా నామినేషన్ ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ,ఇతర అవసరమైన సంబంధిత పత్రాలను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని సూచించింది.