సంఘ్ పరివార్ వల్లనే గవర్నర్ పదవి

సంఘ్ పరివార్ వల్లనే గవర్నర్ పదవి
  •     ప్రధాని మోదీని అందించిన ఘనత ఆర్ఎస్ఎస్ కే దక్కుతుంది
  •     త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యలు

నవీపేట్, వెలుగు:  సంఘ్ పరివార్ కార్యకర్తను కావడంతోనే గవర్నర్ పదవి వచ్చిందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవర్ పూర్వీకుల గ్రామమైన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో బుధవారం ఆయన పర్యటించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. 

ఆర్ఎస్ఎస్ లో పనిచేసే వ్యక్తికి దేశభక్తి, క్రమశిక్షణ ఉంటాయని, దేశానికి ఎందరో ఆణిముత్యాలను అందించిందని తెలిపారు.  ప్రధానంగా ప్రధాని మోదీని అందించిన ఘనత ఆర్ఎస్ఎస్ కే దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో హెగ్డేవర్ స్మృతివనాన్ని నిర్మిస్తుండగా ఆడిటోరియం, మ్యూజియం పనులను ఆయన పరిశీలించారు. దసరా నాటికి స్మృతివనం నిర్మాణ పనులు పూర్తవుతాయని కేశవ సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి వివరించారు. గవర్నర్ వెంట బోధన్ బీజేపీ ఇన్ చార్జ్ మోహన్ రెడ్డి , నేతలు ఉన్నారు.