71 ఏళ్ళ సీనియర్ నటుడితో 31 ఏళ్ళ నటి లవ్ ఎఫైర్.. అసలు విషయం ఏమిటంటే.?

71 ఏళ్ళ సీనియర్ నటుడితో 31 ఏళ్ళ నటి లవ్ ఎఫైర్.. అసలు విషయం ఏమిటంటే.?

సినీ సెలెబ్రెటీల లైఫ్ పై ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కళ్ళతో నిఘా ఉంటుంది. దీంతో వారి పర్సనల్, ప్రొఫెషినల్ లైఫ్ లో జరిగే సంఘటనలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో సెలెబ్రెటీల గురించి ఏదైనా ఓ వార్త బయటికొచ్చిందంటే చాలు యిట్టె వైరల్ అవుతూ ఉంటుంది. అయితే హిందీలో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన నటి శివంగి వర్మ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నటి శివంగి వర్మ, మరో హిందీ నటుడైన గోవింద్ నామ్‌దేవ్ (71) తో ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు గోవింద్ నామ్‌దేవ్, శివంగి వర్మ ఫోటోలని జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై నటుడు గోవింద్ నామ్‌దేవ్ సోషల్ మీడియాలో స్పందించాడు.

ఇందులోభాగంగా తాను శివంగి వర్మతో ప్రేమలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. అలాగే ప్రస్తుతం తామిద్దరూ "గౌరీశంకర్ గోహర్‌గంజ్ వాలే" అనే సినిమాలో నటిస్తున్నామని ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తామిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఇలా తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి లవ్ ఎఫైర్ గురించి వినిపిస్తున్న వార్తలకి చెక్ పడింది.