
ములుగు జిల్లాలో గోవిందరావుపేటలో కుటుంబ కలహాలతో తండ్రిపై కొడుకులు విచక్షణారహితంగా దాడి చేశారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు.. కుటుంబ తగాదాలతో భార్య ఇద్దరు కుమారులతో విడిపోయి తల్లితో వేరుగా ఉంటున్నాడు. తల్లి వృద్ధాప్యం కారణంగా పనిచేయలేని పరిస్థితిలో ఉండగా పనిమనిషిని పెట్టుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నాడని అనుమానించిన వెంకటేశ్వర్లు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడు.. అతను నివాసం ఉంటున్న ఇంటికి వచ్చి ఆదివారం(అక్టోబర్1న) దాడి చేశారు.
వెంకటేశ్వర్లుతో పాటు ఇంట్లో ఉంటున్న మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. దాడిలో వెంకటేశ్వర్లు, అతని తల్లితోపాటు మరో మహిళకు గాయాలయ్యాయి. చికిత్సకోసం ములుగు ఆస్పత్రికి ఏరియా తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.