ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్యాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా బన్నీ సినిమాలకి క్రేజ్ ఉంది. దీంతో గత ఏడాది డిసెంబర్ 05న ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన పుష్ప 2: ది రూల్ ఇండియన్ బాక్సాఫిస్ ని షేక్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ గా ఏకంగా హిందీలో రూ.806 కోట్లు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
అయితే బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా భార్య సునీత అహుజా అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ అని ఓ టాక్ షోలో తెలిపింది. అలాగే తాను పెద్దగా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడనని కానీ అల్లు అర్జున్ పుష్ప సినిమా మాత్రం తన కొడుకుతో కలసి థియేటర్ కి వెళ్లి ఫస్ట్ డే, ఫస్ట్ షో చూశానని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ కి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ తో వర్క్ చేస్తాడని మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని ప్రశంసలు కురిపించింది.
Also Read :- ప్రోమో రిలీజ్.. అన్స్టాపబుల్ షోలో డాకు మహారాజ్ తో గేమ్ ఛేంజర్
ఇక తాను హైదరాబాద్ కి వెళ్లిన ప్రతీసారి కచ్చితంగా అల్లు అర్జున్ కలుస్తుంటానని గ్రేట్ పర్సన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అలాగే తాను అల్లు అర్జున్ కి ఫ్యాన్ అయ్యింది అతడి సిక్స్ ప్యాక్ బాడీ అవుట్ లుక్ చూసి కాదని నటన, స్కిల్స్ వంటివి చూసి అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ కారణంగా కోర్టులు, కేసులు అంటూ సతమతవుతున్నాడు. ఈ ఘటనలో ఇటీవలే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీకి కొంతమేర రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు.