దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజీ పెట్టాలన్న లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆరేడేళ్ల క్రితం వరకూ అతి కొద్ది రాష్ట్రాల్లోనే ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఉన్నాయని, ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలోనూ ఎయిమ్స్ ఉండేలా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఒకప్పుడు ఆరు రాష్ట్రాల్లోనే ఎయిమ్స్ ఉండేవని, త్వరలో ఈ సంఖ్య 22 రాష్ట్రాలకు చేరబోతోందని చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్ నుంచి ఆయన దేశవ్యాప్తంగా పీఎం కేర్స్ ఫండ్స్‌తో ఏర్పాటు చేసిన 35 ఆక్సిజన్ ప్లాంట్లను ఇవాళ మోడీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడంలో, వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా చేపట్టడంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషిని మెచ్చుకున్నారు. ఇప్పటికే దేశంలో 93 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారని, త్వరలోనే ఇది వంద కోట్ల మార్క్‌ను దాటబోతోందని మోడీ అన్నారు. ఇంతవేగంగా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామన్నారు. గతంలో భారత్‌లో రోజుకు 900 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, ఇప్పుడు అది పది శాతం పెరిగిందని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..