- బీఈడీ, ఎంఈడీలో బోధనకు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: బీఈడీ, ఎంఈడీ కోర్సులకు వివిధ సబ్జెక్ట్ ల్లో గెస్ట్ లెక్చరర్లుగా బోధించడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, మాసబ్ ట్యాంక్ ప్రిన్సిపల్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ , రీసెర్చ్ మెథడాలజీ, స్టాటిస్టిక్, ఇంగ్లీష్, ఐసీటీ/కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, విజువల్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సబ్జెక్ట్ ల్లో బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు.
అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఈడీలో కనీసం 55శాతం మార్కులు సాధించి ఉండాలని బోధన మాధ్యమం ఆంగ్లం ఉంటుందన్నారు. విద్యార్హతల జిరాక్స్ కాపీలతో ఈనెల21 సాయంత్రం 4.30 గంటల వరకు ఇనిస్టిట్యూట్, మాసబ్ ట్యాంక్ నందు అప్లికేషన్లు అందించాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇతర వివరాలకు 9963119534 నంబర్లో సంప్రదించాలని కోరారు.