- వనదుర్గా ప్రాజెక్ట్ కింద 3 టీఎంసీలు ఇచ్చేందుకు నిర్ణయం
- 4 మండలాల్లో 26 వేల ఎకరాలకు సాగునీరు
మెదక్, పాపన్నపేట, వెలుగు: జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ కింద యాసంగి సీజన్లో పంటల సాగుకు సంగారెడ్డి జిల్లాలోని సింగూర్‌ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్వచ్చింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన స్టేట్లెవల్కమిటీ ఫర్ఇంటిగ్రేటెడ్వాటర్మేనేజ్మెంట్ (శివమ్) మీటింగ్ లో గోదావరి బేసిన్లో ప్రాజెక్ట్‌ల కింద యాసంగి పంటల పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన వనదుర్గా ప్రాజెక్ట్ ఆయకట్టు పంటల సాగుకోసం 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని జిల్లా ఇరిగేషన్ఆఫీసర్లు ప్రతిపాదించగా సింగూర్‌ప్రాజెక్ట్ నిండుగా ఉండడంతో నీటి విడుదలకు పర్మిషన్ లభించింది.
26 వేల ఎకరాలు సాగు..
వనదుర్గా ప్రాజెక్ట్ కింద కొల్చారం, పాపన్నపేట, మెదక్ రూరల్, మెదక్‌టౌన్, హవేలి ఘనపూర్ మండలాల పరిధిలో సెటిల్డ్ఆయకట్టు 21,625 ఎకరాలు ఉంది. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల ఈ ఆయకట్టుతో పాటు, మహబూబ్‌నహర్, ఫతేనహర్కాల్వలకు సిమెంట్లైనింగ్జరగడం వల్ల అదనంగా మరో 5 వేల ఎకరాలు సాగవుతుందని అంచనా. సింగూర్ నుంచి వనదుర్గా ప్రాజెక్ట్ వరకు మార్గ మధ్యలో జిల్లాలోని చిలప్‌చెడ్, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్మండలాల పరిధిలో మంజీరా నదీ వెంట ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల కింద, నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుకు అవకాశం ఉంది.
విడతల వారీగా నీరు విడుదల
శివమ్కమిటీ మీటింగ్‌లో సింగూర్ ప్రాజెక్ట్ నుంచి వనదుర్గా ప్రాజెక్ట్‌కు 3 టీఎంసీల నీరు విడుదలకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో త్వరలో కలెక్టర్అధ్యక్షతన జిల్లా ఐడీబీ మీటింగ్ జరగనుంది. ఆయకట్టు పరిధిలో సాగుచేసే పంటల అవసరాల కోసం విడతల వారీగా నీటిని విడుదల చేస్తాం. - ఏసయ్య, ఇరిగేషన్ ఎస్ఈ