హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అస్థిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నదని, దానిని తెలంగాణ సమాజమంతా కలసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసి కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర మహిళలు, పండుగలను అవమానించిదని తెలిపారు. తెలంగాణ తల్లి అందరికీ అమ్మ అని, ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
ఆదివారం కవిత తన నివాసం నుంచి బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఎన్నారై విభాగాల నేతలతో ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్రను మరువలేమని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రహస్యంగా తయారు చేయించారని, ప్రజల ఆమోదం ఉంటే అంత రహస్యం ఎందుకని ప్రశ్నించారు.