ఆధార్, పాన్ కార్డ్ లాంటి సెన్సిటివ్ డేటా లీక్ చేస్తున్న వెబ్‌సైట్లు బ్లాక్

ఆధార్, పాన్ కార్డ్ లాంటి సెన్సిటివ్ డేటా లీక్ చేస్తున్న వెబ్‌సైట్లు బ్లాక్

ఆధార్, పాన్ కార్డు అనేవి చాలా వ్యక్తిగతమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. సైబర్ క్రిమినల్స్ ఆ డిటేల్స్ తో ఆర్థిక మోసాలకు పాల్పడుతుంటారు. భారతీయుల సున్నితమైన సమాచారం కొన్ని వెబ్ సైట్లు లీక్ చేస్తున్నాయని.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గుర్తించింది. ఆయా వెబ్ సైట్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పనిచేస్తోంది. ఇండియన్ సిటిజన్స్ ఆధార్, పాన్ కార్డ్ వివరాలతోపాటు ఇంకా సెన్సిటివ్ డేటా బహిర్గతం చేస్తోంఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ది. గురువారం ఆ వెబ్‌సైట్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

ఆధార్ సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించడంపై ఆధార్ UIDAI పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ వెబ్‌సైట్‌ల అనాలసిస్ ప్రకారం కొన్ని భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపింది. సంబంధిత వెబ్‌సైట్ యజమానులకు ప్రజల ప్రైవసీ  దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై ICT గైడ్ లైన్స్ పంపింది. ఐటీ చట్టం ప్రకారం నడుచుకోవాలని CERT-In వెబ్ సైట్లకు సూచించింది. PAN కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్ట్ వంటి వ్యక్తుల కీలక సమాచారం కొన్ని వెబ్ సైట్లు ఇతరుకు చూపిస్తున్నాయి. వ్యక్తుల పర్సనల్ డేటా ఏదైనా లీక్ అయితే వారు ఆన్‌లైన్ స్కామ్‌లకు గురవుతారు. గత వారం, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అధికారులు 3.1 కోట్ల మంది వినియోగదారుల డేటాను విక్రయించారని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ పేర్కొన్న విషయం తెలిసిందే.

జూలై 2024 వరకు అప్‌డేట్ చేయబడిన 31,216,953 మంది కస్టమర్‌ల డేటాను యాక్సెస్ చేయడానికి హ్యాకర్ టెలిగ్రామ్ బాట్‌లను సృష్టించాడు. ఆగస్టు ప్రారంభం వరకు కంపెనీకి సంబంధించిన 5,758,425 క్లెయిమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇమెయిల్ కమ్యూనికేషన్ లో కంపెనీ సీనియర్ అధికారి ఇమెయిల్ ID చూపబడింది. వీడియో ఇమెయిల్ చాట్‌తో పాటు xenZen, కంపెనీ అధికారి మధ్య డీలింగ్ జరిగింది.