ట్యూషన్ టీచర్ కు 111 ఏళ్ల జైలు శిక్ష.. వీడు చేసిన పనికి కరెక్టే కదా..?

ట్యూషన్ టీచర్ కు 111 ఏళ్ల జైలు శిక్ష.. వీడు చేసిన పనికి కరెక్టే కదా..?

ఇలాంటి సంఘటనల గురించి విన్నపుడు, చూసినప్పుడు సమాజం ఎటుపోతోంది..సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా..టెక్​ యుగంలోకూడా ఇలా జంతువుల ప్రవర్తించేవారు ఉన్నారా.. ఆటవిక చర్యలతో పసిమొగ్గలపై దారుణాలకు ఒడిగడతారా.. వీడు చేసిన పాపానికి ఏ శిక్ష వేసినా తక్కువే అనిపించక మానదు. కేరళలో ఓ ట్యూషన్​ టీచర్​ దుర్మార్గపు చర్యకు అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పు సరైనది అని అనిపించకమానదు.

కేరళలోని అంబలతారా విలేజ్​ కు చెందిన మనోజ్​అనే  ట్యూషర్​ టీచర్​కు తిరువనంతరపురం ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు (పొక్సో) కఠిన కారాగార శిక్ష విధించింది.2019లో జరిగిన ఈ సంఘటనలో ఆ నీచుడు మనోజ్​ ను దోషిగా నిర్ధారించి 111 యేళ్ల యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.05 లక్షల జరిమానా విధించింది.

జంతువుల కంటే హీనంగా ప్రవర్తించిన దుర్మార్గుడు మనోజ్ ప్రభుత్వ ఉద్యోగి.. ఇంటి దగ్గర ట్యూషన్లు చెబుతుంటాడు.. వీడు ఏం చేశాడో తెలుసా.. అతని దగ్గరకు ట్యూషన్​ కు వచ్చిన పసిపాపపై అఘాయిత్యం..చేసింది చాలదు అని ఫొటోలు ,వీడియోలు తీశాడు. వీడి దారుణాలు చూసిన భార్య తట్టుకోలేకపోయింది. భర్త దుర్మార్గపు పనులకు విస్తుపోయి ఆత్మహత్య చేసుకుంది.. వీడి దుర్మార్గపు పనులను మరణవాంగ్మూలం ఇచ్చి మరీ చనిపోయింది. 

ALSO READ | మన ఐటీ ఆఫీసులో పులి ఉంది.. ఇంట్లో నుంచే పని చేయండి : ఇన్ఫోసిస్ ప్రకటన

బాధిత బాలిక ప్రస్తుతం ప్రాణాలతో బయటపడింది. కేసు వివరాల ప్రకారం.. విద్యార్థినిపై మనోజ్ కర్కషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప అసభ్యకరమైన ఫొటోలు తీసి సెల్ ఫోన్​ భద్రపరిచాడు.ఆ ఫొటోలు చూసిన  మనోజ్ భార్య తట్టుకోలేకోయింది. ఆత్మహత్య చేసుకుంది. మనోజ్​ భార్య చనిపోయిన తర్వాత విద్యార్థిని ఫొటోలు వైరల్​ అయ్యాయి. భయంతో ఆ బాలిక విషయాన్ని ముందుగా తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. తర్వాత విషయం  తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

అయితే లైంగిక దాడికి కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు మనోజ్​ అన్ని ప్రయత్నాలు చేశాడు.చివరికి కోర్డు మనోజ్​ దోషిగా నిర్ధారించింది. బాలికపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, నిందితుడి భార్య మృతికి కారణమైనట్లు కోర్టు తేల్చింది. 

ఇలాంటి హేయమైన చర్యలకు ఇంకొకరు పాల్పడకుండా నిరోధించేందుకు, సమాజానికి బలమైన మేసేజ్​ అందించేందుకు ఇలాంటి దోషులకు కఠిన శిక్షలు విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.