–ప్రాణాలను రక్షించే మూడు క్యాన్సర్ మందుల ధరలు తగ్గనున్నాయి. ట్రాస్టూజుమాబ్ డెరుక్ట్సెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్పై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. గతంలో ఈ మందులపై 10 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉండగా దానిని సున్నాకు తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఎక్స్ రే యంత్రాల్లో ఉపయోగించే ఎక్స్ రే ట్యూబ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్స్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో ప్రభుత్వం మార్పులను ప్రతిపాదించింది.
దేశీయ తయారీకి మద్దతు ఇవ్వడం, ఎగుమతులను ప్రోత్సహించడం, పోటీతత్వాన్ని పెంచడం కోసం కస్టమ్స్ డ్యూటీల్లో మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.