
న్యూఢిల్లీ: ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు.. అంటే 2027 మార్చి వరకు పెంచడానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని కేబినెట్ అపాయింట్స్ కమిటీ అంగీకరించింది. నాగేశ్వరన్ 2022 జనవరి 28న సీఈఏగా బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, బడ్జెట్ ముందురోజు ప్రవేశపెట్టే ఎకనమిక్ సర్వేను తయారు చేయడం సీఈఏ ఆఫీసు బాధ్యత. ఇది వరకు క్రెడిట్స్విస్ గ్రూప్ ఏజీ, జూలియస్బేయర్ గ్రూపులో పనిచేసిన ఈయన వీకే సుబ్రమణియన్ తరువాత సీఈఏగా బాధ్యతలు చేపట్టారు.