అనురాగ్ వర్సిటీ నిర్మాణం అక్రమం

అనురాగ్ వర్సిటీ నిర్మాణం అక్రమం
  • చెరువు బఫర్​ జోన్​ను అక్రమించి కట్టారని పోలీసులకు ఇరిగేషన్​ ఏఈ ఫిర్యాదు
  • పోచారం ఐటీ కారిడార్ పీఎస్​లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డిపై కేసు

హైదరాబాద్/ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్, వెలుగు: అనురాగ్ విద్యా సంస్థలు, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజేశ్వర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు నీటిపారుదల శాఖ ఏఈ పరమేశ్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. చెరువు బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు ఎకరంన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఏఈ కంప్లయింట్​లో పేర్కొన్నారు. దీంతో రాజేశ్వర్​రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సీఐ రాజు వర్మ తెలిపారు.

వెంకటాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 813 లో గల నాడెం చెరువు బఫర్ జోన్ లో రాజేశ్వర్​రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆస్పత్రి నిర్మించారని ఇప్పటికే పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దీంతో పాటు నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో గణేష్ నాయక్ హైకోర్టులోనూ కేసు వేశారు.

కాంగ్రెస్ సర్కార్​ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: ఎమ్మెల్యే పల్లా 

కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆరోపించారు.  తాను ఎక్కడా బఫర్ జోన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ‘కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తోంది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, వారిచ్చిన నివేదిక ఆధారంగానే హెచ్ఎండీఏ అనుమతులతో మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేపట్టాం. ఇరిగేషన్, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్​మెంట్, ఎయిర్​పోర్ట్ అథారిటీలు ఎన్ఓసీలు ఇచ్చాయి. వీటి ఆధారంగా హెచ్ఎండీఏ ఫైనల్ అనుమతి ఇచ్చింది. అక్రమ కేసులకు భయపడేది లేదు. చట్టం పరిధిలో న్యాయం కోసం పోరాడుతాం’ అని ఎమ్మెల్యే  ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

నిబంధనల ప్రకారమే ఆక్రమణలు తొలగించాలి: హైకోర్టు

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి చెందిన అనురాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో ఆక్రమణలు ఉన్నట్లయితే వాటిని నిబంధనల ప్రకారమే తొలగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ముందస్తు నోటీసులు జారీచేసి.. వివరణ తీసుకున్నాక చర్యలు చేపట్టాలని సూచించింది. ఆక్రమణల పేరుతో అధికారులు తమ ఆస్తుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని గాయత్రి ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసైటీతోపాటు అనురాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు శనివారం హైకోర్టులో హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాత్రి 9 గంటల ప్రాంతంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వొకేట్​ డి.ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదనలు వినిపించారు. 17.21 ఎకరాల్లో అన్ని అనుమతులు తీసుకుని విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

నీలిమ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నిర్మాణాలు నాదం చెరువు బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్​లో ఉన్నాయన్న నివేదిక ఆధారంగా ఏఈ.. పోచారం ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్​లో ఫిర్యాదు చేశారన్నారు. హైడ్రాతో కలిసి నిర్మాణాలను కూల్చివేసే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ప్రభుత్వం తరఫున స్పెషల్​అడ్వొకేట్​ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, హైడ్రా తరఫున కటిక రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి చర్యలు చేపట్టకముందే అనవసర ఆందోళనతో కోర్టుకు వచ్చారన్నారు. నాదం చెరువు బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఆధారాలున్నాయన్నారు. చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాదనలను విన్న జడ్జి.. చట్టప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ అడ్వొకేట్​హామీని నమోదు చేస్తూ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణను మూసివేశారు.