HYDRA..ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి.జీహెచ్ ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చేవేస్తున్న హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. FTL, బఫర్ జోన్ లోని నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖుల అక్రమ బిల్డింగులను కూడా కూల్చిసింది. హైడ్రా చర్యలపై ప్రజలను మంచి స్పందన వస్తుండటంతో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇస్టున్నారు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు.. రాబోయే రోజుల్లో అన్ని డిపార్టుమెంట్లను ఒకే గొడుగు కింద తీసుకొచ్చే యోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రస్తుతం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తు హైడ్రా..మున్ముందు హైడ్రా పేరుతో నోటీసులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అన్ని శాఖలకు సంబంధించిన అధికారులను హైడ్రా పరిధిలోని తీసుకొచ్చి సరిపడా మ్యాన్ పవర్ వచ్చాక హైడ్రా పేరుతో నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కొత్త GO తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.