16 ఏళ్ల నిరీక్షణకు తెర: 2008 డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

16 ఏళ్ల నిరీక్షణకు తెర: 2008 డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2008 డీఎస్సీలో నష్ట పోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డీఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగం పొందని బీఈడీ అభ్యర్థులకే ఈ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం.. హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవాళ (సెప్టెంబర్ 24) ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ | ఓయూ సమస్యలపై పూర్తి నివేదిక : విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ

 ఈ నెల 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులకు కౌన్సిలింగ్  నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. కాగా, 2008 డీఎస్సీ బాధితులు దాదాపు 2 వేల వరకు ఉండగా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇన్నాళ్లు కాళ్ల చెప్పులరిగేలా  అధికారులు, ఆఫీస్‎ల చుట్టూ తిరిగామని.. ఇప్పటికైనా తమ గోడును అర్థం చేసుకుని ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరిచడంతో  2008 డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.