
ములుగులో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు 2 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క. ఎవరెన్ని కుట్రలు చేసినా... ప్రజలు మద్దతుతో గెలుస్తానని చెప్పారు. ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే సీతక్క. అంతకుముందు ములుగు గట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నేతలు, కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించారు.
రెండు నెలలుగా ఈ నియోజకవర్గంలో తోడేళ్లు, మిడతల మాదిరి వచ్చారని ధ్వజమెత్తారు సీతక్క. కరోనా సమయంలోనూ.. వరదలు వచ్చినప్పుడు రానీ బీఆర్ఎస్ నాయకులు ఇపుడు డబ్బుల కట్టలతో తనను ఓడించడానికి వస్తున్నారన్నారు. తనను టార్గెట్ గా పెట్టుకుని రూ. 200 ల కోట్లు ఖర్చు చేస్తున్నారని అని ధ్వజమెత్తారు. ములుగులో సరైన అభ్యర్థి ఎవరో తెల్సుకుని ఓటు వేయాలన్నారు. కరోనా టైంలో అందరికంటే ముందు అసెంబ్లీలో తానే కేసీఆర్ ను ప్రశ్నించానన్నారు సీతక్క.
ములుగులో బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి, కాంగ్రెస్ నుంచి సీతక్క..బీజేపీ నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పోటీచేస్తున్నారు.