హస్మత్ పేట చెరువులో అక్రమ నిర్మాణాలు. వారం రోజుల్లో కూల్చేయాలని నోటీసులు

హస్మత్ పేట చెరువులో అక్రమ నిర్మాణాలు. వారం రోజుల్లో కూల్చేయాలని నోటీసులు

చెరువులు ఆక్రమణపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని గుర్తించిన హైడ్రా నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేస్తుంది.  బాలానగర్‌లోని హస్మత్‌పేట్ చెరువు (బోయిన్) చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) ,  బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు  రెవెన్యూ శాఖ ఆగస్టు 27న  నోటీసులు జారీ చేసింది. ఆక్రమంగా నిర్మించిన నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు ధిక్కరిస్తే నిర్మాణాలను కూల్చివేయడం లేదా ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 

 హస్మత్ పేట్  చెరువు పరిధిలో 148 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  చాలా సంవత్సరాలుగా నిర్మాణాలు జరుగుతున్నందున ఈ సంఖ్య మరింత ఎక్కువ  ఉండవచ్చని చెబుతున్నారు స్థానిక అధికారులు.

ALSO READ | రెండు గంటల్లో కూల్చేస్తం.. స్టేలు తెచ్చుకునే టైం ఇవ్వం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

కూకట్‌పల్లి సమీపంలోని సున్నం చెరువు, నానక్‌రామ్‌గూడలోని మేడికుంట చెరువు, గౌలిదొడ్డిలోని గోసాయికుంట చెరువు, చందానగర్‌ సమీపంలోని పెద్దచెరువు, నల్లగండ్ల సమీపంలోని నల్లగండ్ల చెరువు, దుర్గంలోని మద్దల చెరువు, దుర్గంలోని కూకట్‌పల్లి సమీపంలోని సున్నం చెరువు సహా హైదరాబాద్‌లోని పరిధీయ జిల్లాల్లోని 13 సరస్సుల్లో విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగాయి. పీర్జాదీగుట్టలోని పెద్దచెరువు, ఉప్పల్‌లోని నల్ల చెరువు, దుండిగల్‌లోని చిన్న దామెర చెరువు, కూకట్‌పల్లిలోని అంబర్ చెరువు, చిన్నరాయుని చెరువు, బోయిన్ చెరువు ఆక్రమణలకు గురయ్యాయని అధికారులు గుర్తించారు.