జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. జవహర్ నగర్ లోని సర్వే నెంబర్లు 476, 501 లోని కోట్ల రూపాయల విలువ చేసే ఐదు ఎకరాల ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్య, ఆమె కుటుంబ సభ్యులు అక్రమంగా కబ్జా చేసి ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇంటికొచ్చి బెదిరిస్తున్నారని ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు.
పేదలు 60 ,70 గజాల్లో ఇల్లు కట్టుకుంటే అక్రమ కట్టడాలంటూ కూల్చివేస్తున్న అధికారులు రాజకీయ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు భష్యత్తులోఉపయోగపడుతుందని కేటాయిస్తే అధికారులను పాలకులను మేనేజ్ చేస్తూ మేయర్ కావ్య అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.