న్యూఢిల్లీ : మార్కెటింగ్ మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఏఐ ఆధారిత హెల్ప్‌లైన్‌ను, టూల్స్‌ను, ఈ–మ్యాప్ పోర్టల్‌ను, జాగో గ్రాహక్యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ షాపింగ్సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని రిలయన్స్‌రిటైల్, టాటా సన్స్, జొమాటో వంటి ఈ–కామర్స్ కంపెనీలు హామీ ఇచ్చాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
ఆన్‌లైన్‌లో కార్యక్రమానికి హాజరైన మంత్రి, ఈ ఏడాది జనవరి–-నవంబర్ మధ్య జాతీయ వినియోగదారుల కమిషన్‌లో దాఖలైన 6,587 కేసులలో 3,628 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. 2020లో మొదలైన ఈ–దాఖిల్ పోర్టల్ గత జూన్‌నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు