- ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్
- కిలో రూ. 29గా నిర్ణయించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై అందిస్తున్న భారత్ రైస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో భారత్ రైస్ విక్రయాలను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. భారత్ రైస్ బ్రాండ్ బియ్యం కిలో రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటి ఫేజ్ లో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్ ను విక్రయిస్తారు. ఇందుకోసం సుమారు 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్ సీఐ సరఫరా చేయనుంది. భారత్ రైస్ ఈ–కామర్స్ వెబ్ సైట్లలోనూ అందుబాటులో ఉంటుంది.
ALSO READ: ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఏం చేద్దాం?