ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంబరంగా కామన్​ మెనూ షురూ

 ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంబరంగా కామన్​ మెనూ షురూ

వెలుగు నెట్​వర్క్​ : గురుకులాలు, హాస్టల్స్ స్టూడెంట్స్​కు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకే ప్రభుత్వం కామన్​ డైట్​ప్లాన్​ అమలు చేసింది.  8 ఏండ్ల తర్వాత డైట్ చార్జీలు, 16 ఏండ్ల తర్వాత కాస్మోటిక్స్ చార్జీలను పెంచింది. శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావారణంలో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపును అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హయ్యర్​ఆఫీసర్లు సందర్శించారు. స్టూడెంట్స్​తో కలిసి వారు భోజనాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం కోసం ఈ చార్జీలను ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు.

హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచడం, నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్టూడెంట్స్​ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, భవిష్యత్​లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.