సెయిల్‌‌‌‌లో విశాఖ స్టీల్ విలీనం?

  • ఆలోచనలో కేంద్రం

న్యూఢిల్లీ : విశాఖ స్టీల్  రాష్ట్రీయ ఇస్పాత్​ నిగమ్‌‌‌‌ లిమిటెడ్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎన్‌‌‌‌ఎల్‌‌‌‌) ను  ప్రభుత్వ సంస్థ సెయిల్‌‌‌‌లో విలీనం చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ విలీనాన్ని చేపట్టాలని ఆలోచిస్తోంది. అంతేకాకుండా విశాఖ స్టీల్‌‌‌‌కు చెందిన 1,500–2,000 ఎకరాల ల్యాండ్‌‌‌‌ను ఎన్‌‌‌‌ఎండీసీకి అమ్మడం, బ్యాంక్ లోన్ల ద్వారా క్యాపిటల్ అందించాలనే 

ప్రపోజల్‌‌‌‌ను  కూడా పరిశీలిస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ గురించి చర్చించేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ డిప్యూటి సెక్రెటరీ, స్టీల్ మినిస్ట్రీ సెక్రెటరీ, ఎస్‌‌‌‌బీఐ ప్రతినిధులు తాజాగా సమావేశమయ్యారు. ఎస్‌‌‌‌బీఐ ఇప్పటికే ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎన్‌‌‌‌ఎల్‌‌‌‌కు భారీగా అప్పులిచ్చింది.