
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ యాడ్స్‌పై వేస్తున్న ఈక్విలైజేషన్ లెవీ లేదా డిజిటల్ ట్యాక్స్‌ను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. యూఎస్ ప్రభుత్వం ఏప్రిల్ 2 నుంచి ఇండియాపై ప్రతీకార టారిఫ్‌లు వేయనున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వాన్ని బుజ్జగించే పనిలో ప్రభుత్వం ఉంది.
డిజిటల్ ట్యాక్స్ రద్దు చేస్తే గూగుల్, మెటా వంటి అమెరికన్ కంపెనీలు ఎక్కువగా లాభపడతాయి. ఫైనాన్స్ బిల్లు 2025 కి 59 సవరణలు చేయాలని కేంద్రం ప్రపోజ్ చేసింది. ఇందులో భాగంగా డిజిటల్ ట్యాక్స్‌ను రద్దు చేయనుంది. ఆన్‌లైన్ యాడ్ సర్వీస్‌లపై 2016, జూన్ 1 నుంచి ఈక్విలైజేషన్ లెవీని ప్రభుత్వం వేస్తోంది. ఈ–కామర్స్ ట్రాన్సాక్షన్లపై వేస్తున్న 2 శాతం ఈక్విలైజేషన్ లెవీని కిందటేడాది తొలగించారు. ఆన్‌లైన్ యాడ్స్‌పై 6 శాతం లెవీ కొనసాగుతోంది.