గృహజ్యోతి సబ్సిడీ 180 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: గృహజ్యోతి పథకాని కి సంబంధించిన నవంబర్ నెల విద్యుత్ సబ్సిడీ రూ.180.62 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని టీజీ డిస్కంలకు అం దించనున్నారు. గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందిస్తుంది. నవంబర్ నెలకు సంబంధించిన 200 యూనిట్ల ‘0’ బిల్లులను ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు.