
న్యూఢిల్లీ: శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఇటీవల ఎయిర్టెల్, జియోతో చేతులు కలిపిన ఎలాన్‌మస్క్ స్టార్‌లింక్‌ను మనదేశంలో కంట్రోల్సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరింది. సమస్మాత్మక ప్రాంతాల్లో ఎప్పుడంటే అప్పుడు నెట్సేవలను నిలిపివేయడానికి దీనిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అవసరమైనప్పుడు కాల్స్‌ను అడ్డుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది.
ఏదైనా ప్రాంతాల్లో హఠాత్తుగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆయా ప్రాంతాల్లో నెట్సేవలను ప్రభుత్వాలు నిలిపివేస్తాయి. స్టార్లింక్మనదేశంలోనే కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తే దాని సేవలను నియంత్రించడానికి వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఆపద సమయాల్లో యూఎస్‌లోని స్టార్‌లింక్ అధికారులతో సంప్రదింపులు జరపడం కష్టం కాబట్టి సెంటర్ ఏర్పాటు చేయాలంది.