కూలీ పనిదినాలు పెంచాలి : సురేంద్ర

జైనూర్, వెలుగు: వ్యసాయ కూలీలకు ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు కల్పించాలని డీఆర్డీఏ పీడీ సురేంద్ర సూచించారు. జైనూర్ మండలంలో 2021నుంచి 2023 మార్చి వరకు జరిగిన ఉపాధి హామీ కింద రూ. 5 కోట్ల 98లక్షలతో జరిగిన పనులపై శుక్రవారం సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. ఎంపీపీ తిరుమల అధ్యక్షతన నిర్వహించిన ప్రజావేదికలో 26 పంచాయతీలకు సంబంధించిన పనుల నివేదికలను సామజిక తనిఖీ డీఆర్పీలు అందచేశారు.

ఈ సందర్బంగా పీడీ మాట్లాడుతూ  ప్రతి కూలికి న్యాయం చేయాలన్నారు.  తనిఖీల్లో  రూ. లక్ష 20 వేల మేరకు దుర్వినియోగం జరిగినట్టు తేలిందన్నారు. ఈ డబ్బులను రికవరీ చేస్తామన్నారు.  కార్యక్రమంలో విజిలెన్స్ అఫీసర్ కృష్ణమూర్తి, పరిశీలకులు సాయి ప్రియ, ఎంపీడీఓ ప్రభుదయ,  ఏపీవో నగేశ్, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.