ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే రామచంద్రునాయక్

కురవి ,వెలుగు: మిర్చి రైతులకు సరైన ధరను నిర్ణయించి ప్రభుత్వం అండగా ఉంటుందని  ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు.  కురవి మండలం బలపాలలో   ఆరబోసిన మిర్చిని పరిశీలించారు. మిర్చి రైతులతో మాట్లాడారు.

మండల వ్యవసాయ అధికారి మంజుఖాన్ పంటల సాగు వివరాలు దిగుబడి గురించి ఎమ్మెల్యే కు వివరించారు. మిర్చి సాగు దిగుబడి అంతగా లేదని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండ చర్యలు తీసుకుంటమన్నారు.అనంతరం డోర్నకల్ మండల కేంద్రంలో ని జైన్ మందిర్ ను స్దానిక నాయకులతో కలసి పరిశీలించారు. ఆయన వెంట తాళ్ళురి హనుమ ,మాదశ్రీను ,కాలం రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.