ఆదాయంపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లను వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నుంచి ఆస్తుల వేలం ద్వారా కనీసం 2 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్ల వేలానికి సిద్ధమైంది సర్కార్.
గ్రేటర్ లోని బండ్లగూడ, నాగోలు, పోచారం, గాజులరామారం, జవహర్‌నగర్.. ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లను వేలం వేయనుంది. చట్టబద్దంగా ఎలాంటి వివాదాల్లేని ఆస్తులను వేలం వేయనుంది. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించనున్నట్లు సమాచారం. వివరాల ప్రకారం.. 760 ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తోంది. బండ్లగూడలో 159, పోచారంలో 601 ఉన్నాయి. దాదాపు 350 ఎకరాల్లో 1342 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లు చందానగర్, కుందనపల్లి, కవాడపల్లి, కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి, గాజులరామారం, గద్వాల్, అల్లాపూర్, తొర్రూరులో ఉన్నాయి.అదనంగా వేలంలో 36 అసంపూర్తిగా కట్టిన టవర్స్ కూడా ఉన్నాయి.
ALSO READ | శంషాబాద్‌లో హైడ్రా యాక్షన్.. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలు కూల్చివేత
గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA).. ఇతర జిల్లాల పరిధిలోని ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున మూడు కమిటీలను ఆస్తులను అంచనా వేయడానికి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటీవల సిఫార్సులను ప్రభుత్వానికి అందించింది. ఈ క్రమంలోనే వేలానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం.