న్యూఢిల్లీ: స్టీల్ సెక్టార్‌కు సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్‌లో మరో రౌండ్‌ను సోమవారం ప్రభుత్వం లాంచ్ చేయనుంది. స్టీల్ మినిస్టర్ హెచ్‌డీ కుమారస్వామి ‘పీఎల్‌ఐ స్కీమ్ 1.1’ పేరుతో దీనిని లాంచ్ చేస్తారు. మొదటి రౌండ్‌లో అనుకున్నంత పెట్టుబడులు రాకపోవడంతో రెండో రౌండ్‌కు కేంద్రం సిద్ధమయ్యింది. స్పెషాలిటీ స్టీల్ ప్రొడక్షన్‌ను పెంచేందుకు, దిగుమతులను తగ్గించేందుకు కేంద్రం పీఎల్‌ఐ స్కీమ్‌ను 2020 నవంబర్‌లో తీసుకొచ్చింది.
దీని కింద స్టీల్ సెక్టార్‌లోకి రూ.27,106 కోట్ల పెట్టుబడులు , 14,760 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. 79 లక్షల టన్నుల స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తి కానుంది. కిందటేడాది నవంబర్ నాటికి కంపెనీలు రూ.18,300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. 8,660 మందికి ఉద్యోగాలొచ్చాయి.