గుడ్న్యూస్..త్వరలో ప్రభుత్వ MSME క్రెడిట్ కార్డులు

గుడ్న్యూస్..త్వరలో ప్రభుత్వ MSME క్రెడిట్ కార్డులు

2025 కేంద్ర బడ్జెట్‌లో హామీ ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం MSME లు స్థాపించే చిన్న వ్యాపారులకు ప్రభుత్వ క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. రూ. 5లక్షల లిమిట్ తో ఈ క్రెడిట్ కార్డులు అందించనున్నారు. ప్రభుత్వ క్రెడిట్ కార్డుల ద్వారా మైక్రో -యూనిట్ల అదనంగా రూ.30వేల కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది వ్యాపార వృద్ది, రుణాల పొందుటకు మంచి ఎంపిక. ఈ పథకం కింద క్రెడిట్ కార్డులు పొందేందుకు చిన్న వ్యాపారులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  

క్రెడిట్ కార్డులు ఎవరికి ఇస్తారంటే.. 

రూ.5లక్షల లిమిట్ తో క్రెడిట్ కార్డులను షాపులు , చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారికి ఇస్తారు. వ్యాపారుల UPI లావాదేవీలు, బ్యాంక్ స్టేట్ మెంట్లు, వ్యాపార స్థితిగతులు అంచనా వేసి ఈ కార్డులను మంజూరు చేస్తారు. కార్డు చెల్లుబాటు కాలం ఒక సంవత్సరం.రూ. 10 లక్షల నుంచి 25 లక్షల మధ్య ఉన్న వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో క్రెడిట్ కార్డులకు అర్హులు. 

ఎలా అప్లయ్ చేసుకోవాలంటే.. 

ప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్‌ (Udyam) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్‌లో నమోదుకు ఈ దశలు పాటించండి..

  • అధికారిక ఉద్యమ్‌ పోర్టల్ msme.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • క్విక్ లింక్స్ పై క్లిక్ చేయాలి. 
  • ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. 
  •  రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించాలి.