అసమర్థుడి జీవయాత్రలా మా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని కేటీఆర్ అన్న వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ... పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే కుక్కలు చింపిన విస్తరి చేసిన వాడు సమర్థుడా.. అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న అప్పుల కుప్పగా మార్చినవాడు సమర్థుడా...? ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ... వేల కోట్ల కమిషన్లు నొక్కేసి ప్రాజెక్టులను గాలికొదిలేసిన వాడు సమర్థుడాఅని ప్రశ్నల వర్షం కురిపించారు,కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతున్నారు.. కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ కు పరిమితం కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు వచ్చి.. ప్రతిపక్షాలు చెప్పేది విని మా సీఎం రోజూ సెక్రటేరియట్ కు వస్తున్నాడు.. ప్రతిపక్షాలు చెప్పేది కూడా వింటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కౌశిక్ రెడ్డి మహిళలను కించపరచినందుకు .. ఆయనను అభినందించేందుకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లావా అని కేటీఆర్ అని ఆది అడిగారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కల్లు తాగిన కోతిలా చిందు లేస్తున్నందుకు సత్కారం చేసి వచ్చావా..?ఆంధ్రా సెటిలర్లును అవమానించినందుకు అలాయ్ బలాయ్ ఇచ్చి వచ్చావా...? పోలీసు అధికారులను బెదిరిస్తున్నందుకు వెన్నుతట్టి అభినందించి వచ్చావా....? అని కేటీఆర్ ను మీడియా ముఖంగా అడిగారు.
ALSO READ : పదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పట్టిపీడించింది : డిప్యూటీ సీఎం
బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయాన్ని గాలికొదిలేసి వేల మంది రైతుల ఆత్మహత్య లకు కారణం అయినోడు సమర్థుడా..? హైదరాబాద్ లో సెల్ఫీ పాయింట్లు తప్ప మరొకటి చేయని నువ్వు సమర్థుడివా... అన్నారు.
అధికారంలో వచ్చిన ఎనిమిది నెలల్లో 31 వేల కోట్ల రుణమాఫీ చేసిన మా రేవంత్ రెడ్డి అసమర్థుడా..? ఐదు గ్యారెంటీలను అమలు చేస్తు పేదోడి ఇంట్లో వెలుగులు నింపుతున్న మా సీఎం రేవంత్ రెడ్డి ఎలా అసమర్థుడో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1 వ తేదీనే జీతాలు ఇవ్వడంతో పాటు ప్రమోషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి అసమర్థుడయ్యాడా... ? అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో మమ్మల్ని జీరో చేసిన మా రేవంత్ రెడ్డి నీకు అసమర్థుడిలా కనిపిస్తున్నాడా.?
పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదు
ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభాలు పెట్టి మీ పార్టీలో చేర్చుకున్న నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతావా.. అని కేటీఆర్ ను విమర్శించారు. 2019 లో పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షం కాకుండా మజ్లిస్ పార్టీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఆ రోజు ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తి ఏమయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులను.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు .. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఎన్ని సార్లు అరెస్ట్ చేశారో లెక్కలు కావాలా.. ఒక ఎంపీ డ్రోన్ ఎగురవేశాడని 14 రోజులు జైలు పెట్టిన రోజులు మరిచిపోయావా..? బెడ్రూం తలుపులు బద్దలు కొట్టి మా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు నువెక్కడున్నావు.. అని ప్రశ్నించారు.
అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చి కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రజలు అల్లాడిపోతే కేటీఆర్ వారి గురించి మాట్లాడరు. రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదన్నారు, అమెరికా నుంచి రాగానే ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తాడని అనుకున్నం.. రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప కేటీఆర్ కు మరొకటి లేదన్నారు... నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు, ప్రజాస్వామ్యయుతంగా మా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందంటూ... బీఆర్ ఎస్ నేతలు ఉనికి కోల్పోతామన్న భయంతోనే విమర్శలు చేస్తు్న్నారని అన్నారు.