వేములవాడ, వెలుగు : ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నారని, రాజన్న క్షేత్రం, జిల్లా సమగ్ర అభివృద్దే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని రాష్ర్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం పట్టణంలోని గుడి చెరువు ఆవరణలో హెలిపాడ్, సభ ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ, జౌళీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖీల్ మహాజన్ తో కలిసి పరిశీలించారు.
రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేయబోయే సీఎం బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వారి వెంట దేవాదాయ శాఖ స్థపతి వల్లి నాయగం, ఈఓ వినోద్ రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.