హరీశ్.. నోరు అదుపులో పెట్టుకో

రేవంత్​ను విమర్శిస్తే ఊరుకునేది లేదు: విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్, వెలుగు: నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. లేదంటే తెలంగాణ ప్రజలే నాలుక కోస్తారని హరీశ్​ రావును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు. బీఆర్​ఎస్​ను రాష్ట్ర ప్రజలు వద్దనుకుని అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారన్నారు. ఛీ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. 

సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని ప్రకటనలో హెచ్చరించారు. రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో పండుకుంటా అని చెప్పిన హరీశ్ రావు.. ఇప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పారని.. ఆయన గుండెల్లో హరీశ్ రావు నిద్రపోవాలని ఎద్దేవా చేశారు. రైతులను రుణవిముక్తి చేసిన 
ఘనత రేవంత్ రెడ్డిదే అని అన్నారు.