60 లక్షల మంది మహిళలను వ్యాపారులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

వరంగల్: రాష్ట్రంలో 60 లక్షల మంది మహిళలను వ్యాపారులుగా మార్చాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం-ప్రజా పాలన -ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 19) వరంగల్‎లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలపై భారం పడకూదని తమ ప్రభుత్వం భావిస్తోందని.. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్‏పై రాయితీ ఇచ్చి భారం తగ్గించామని పేర్కొన్నారు.

ALSO READ | కలెక్టర్‎పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు

 దీంతో పాటుగా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆర్థికక భారం తగ్గించామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతోగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ కొనసాగిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపైన విపక్షాలు దుష్ప్రచారం చేస్తు్న్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క.