ట్యాంక్ బండ్​పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి

 ట్యాంక్ బండ్​పై సర్వాయి పాపన్న  విగ్రహం పెట్టాలి
  • మంత్రి పొన్నం ప్రభాకర్ కు గౌడ సంఘాల విజ్ఞప్తి 

ముషీరాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని గౌడ సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ నేతృతంలో వివిధ గౌడ సంఘాల నాయకులు గురువారం సిటీలోని నివాసంలో మంత్రిని కలిశారు.

 నీరా కేఫ్ బిల్డింగ్​ను గీత కార్పొరేషన్ కు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రెండో విడతలో భాగంగా 15 వేల మంది గౌడ్​లకు కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ కిట్స్ ఇస్తామన్నారు. పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.