దుఃఖం ఎలా తీరుతుంది.. గౌతమ బుద్దుడు చెప్పిన  ఏంచెప్పాడంటే 

దుఃఖం ఎలా తీరుతుంది.. గౌతమ బుద్దుడు చెప్పిన  ఏంచెప్పాడంటే 

ప్రతి మనిషి నిత్యం సుఖ దుఃఖాలతో ఉంటాడు.. సుఖం వచ్చినప్పుడు ఒకలా.. దుఃఖం వచ్చినప్పుడు మరోలా ప్రవర్తిస్తుంటాడు.  దుఃఖం వచ్చిన రోజు.. దాన్ని మోయలేక.. మార్గం చూపే గురువుకోసమో, తీరుస్తాడని భగవంతుడి కోసమో ప్రార్థిస్తుంటారు. కానీఅయితే త్రిశరణాలు ఉంటే చాలు దుఃఖం దూరమవుతుంది అంటాడు బుద్దుడు. త్రిశరణాలే గురువని.. దైవమని బుద్దుడు చెప్పాడని బౌద్ద గ్రంథాల ద్వారా తెలుస్తోంది.  ఈ విషయం గురించి మరింత లోతుగా అధ్యయం చేస్తే....

గౌతమబుద్దుడు గంగానదీ తీరంలో తన శిష్యులతో కలిసి జీవించేవాడు.   ఆ నది సమీపంలో ఉన్న అడవికి తపస్సు చేసుకోవడానికి కొంతమంది యువ యోగులు,సిద్ద పురుషులు వస్తుండేవారు. వారు నిత్యం స్నానం చేసేందుకు గంగానదికి వచ్చేవారు.  ఇలా ఉండగా  విమలానందుడు అనే  యోగి రోజూ స్నానానికి వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు గౌతమ బుద్దుడిని చూస్తూ వెళ్లేవాడు. 

ఇలా జరుగుతుండగా.. ఒకానొక రోజు ప్రశాంతంగా ఉండే బుద్దుడి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు.  ఆ తరువాత విమలానందుడు  గౌతమ బుద్దుడి వద్దకు వెళ్లి... నమస్కరించి.. మహాత్మా.. మీరెవరో నాకు తెలియదు కాని.. మీ సన్నిధిలో ఉంటే    నాలో దివ్యానుభూతులు కలుగుతున్నాయి. దయచేసి నాకు మీ బోధను అనుగ్రహించండి' అన్నాడు. 

నాయనా...  నేను గౌతమ బుద్ధుడిని. సుదీర్ఘ తపస్సుతో పరమ సత్యాన్ని ఫలంగా పొందాను. దుఃఖ భారంతో కుంగిపోతున్న ప్రపంచానికి పరమ సత్యమే సంపూర్ణ రక్ష' అని బుద్దుడు...  విమలానందుడికి చెప్పాడని బౌద్ద గ్రంథంలో ఉంది.   అప్పుడు విమలానందుడు   పరమసత్యం  అంటే ఏమిటి.. ఎక్కడ ఉంటుంది మహాత్మా?" అని అడిగాడు .

ప్రపంచంలో సుఖదుఃఖాలు రెండూ శాశ్వతం కాదు. మనిషి త్రిశరణాలను నమ్ము కోవడమే నిర్వాణానికి మార్గం' అంటాడు. త్రిశరణాలు అంటే ఏంటి? ఎలా పొందాలి?' వివరించమని విమలానందుడు ... బుద్దుడిని అడుగగా... బౌద్ధంలో ధ్యానానిదే అగ్రపీఠం. ధ్యానం అంటే మనల్ని మనం తెలుసుకోవడం, త్రిశరణాలు పాటించే ధ్యానం సులభంగా ఉంటుంది అంటాడు. 

  • బుద్ధం శరణం గచ్చామి 
  • ధర్మం శరణం గచ్ఛామి 
  • సంఘం శరణం గచ్చామి 
  • అంటే.. వరుసగా  జ్ఞానాన్ని ఆశ్రయించు  ... ధర్మాన్ని పాటించు....సంఘాన్ని సేవించు  ఇవే త్రిశరణాలు.

 వీటినే ఆచరించాలన్నాడు బుద్ధుడు. ఆ బోధకు ము గ్ధుడైన విమలానందుడు 'నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండని వేడుకుంటాడు. త్రిశరణాలనే గురువుగా భావించు. అహింసను ఆరాధించు. మనసా, వాచా, కర్మణా ఎవరినీ బాధించకు. అదే అహింస...  వీటిని పాటిస్తే నిర్వాణమనే మోక్ష మార్గంలోకి వెళతావు, అదే నిజమైన ఆనందాన్నిస్తుంది. దాన్ని అనుభవిస్తే గానీ అర్ధం కాదు అని ఆశీర్వదించి సెలవు తీసుకో మంటాడు బుద్ధుడు.